14, సెప్టెంబర్ 2013, శనివారం

మొదటి కార్టూన్


ఊమెన్ గారి కార్టూన్లు ప్రప్రధమంగా ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రిక వారు 20 07 1960 వార పత్రికలో ప్రచురించారు. అప్పటి ప్రకటన ఈ విధంగా ఉన్నది.
ఊమెన్ గారు వేసిన మొదటి కార్టూన్లు 
పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం!?
పాకిస్థాన్ లో అప్పటి రాజకీయ పరిస్థితి కి అద్దం పడుతూ వేసిన కార్టూన్. సైనిక నియంత ఐన ఆయూబ్ ఖాన్ అధికారాన్ని హస్తగతం చేసుకుని, దేశాన్ని పరిపాలించటం మొదలు పెట్టాడు. ఉట్టి మాటలతో రాజ్యాంగం అంటూ తమ దేశంలో ఏదో ప్రజాస్వామ్యం ఉన్నది అన్న భ్రమ కల్పించటానికి ఆయన కొంత తూ  తూ  మంత్రపు ప్రయత్నం చేశారు. సైనిక నియంత,  తానూ ప్రజాస్వామ్యబధ్ధుడిని అని ప్రజల నోళ్ళు నొక్కేసి,  తాను  రచింప చేసిన రాజ్యాంగాన్ని వాళ్ళ నెత్తిన రుద్దటం ఊమెన్ గారు అద్భుతంగా చెప్పారు ఈ కార్టూన్లో









 నెహ్రూ గారి పరుగు

ఇక ఈ కార్టూన్లో నెహ్రూ గారు తనకు మత్రమే తెలిసిన పంచవర్ష ప్రణాళికలను తయారుచేయిస్తూ, అప్పటి ఆర్ధిక పరిస్థితులతో ఆడుకున్నపటి విషయం. జాతీయాదాయం ఐదు శాతం అనుకుంటూ నెహ్రూ గారు పరుగు పెడుతున్నా  కూడా, ఆయన కన్నా ఎన్నో రెట్లు పెద్దగా,  చెట్టంత ఉన్న ద్రవ్యోల్బణం అనే మనిషి చులాగ్గా  నడిచిపోతూ, నెహ్రూ గారిని దాటి వెళ్ళిపోవటం, పెద్దగా ఎకానమీ మీద ప్రభావం చూపని నెహ్రూ గారి ఆర్ధిక విధానాలను నవ్వులు పాలు చెయ్యటమే అని ఊమెన్ గారి హాస్య పూర్వక విమర్శ. 

నెహ్రూ గారు ఆర్ధికవేత్త కాదు. ఏదో ఆయనకి ఉన్న రొమాంటిక్ ఆలోచనలతో తనకు తెలిసినట్టుగా పరిపాలించే ప్రయత్నం చేశారు. కాని ఈ నాడు, సాక్షాత్తుగా రిజర్వు బాంకు గవర్నరుగా చేసి, ఆర్ధిక మంత్రిగా చేసి అపారమైన అనుభవమున్న వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా, ఇవ్వాళ్టికీ ద్రవ్యోల్బణానిదే గెలుపు. ఎక్కడుంది, పొరబాటు! 

ఊమెన్ గారు ఈరోజున మన మధ్య ఉండి  ఉంటే, ఈ కార్టూన్ వేసిన 43 సంవత్సరాల తరువాత కూడా, ఊమెన్ గారు చెయ్యవలసినది ఒక చిన్న పని  మాత్రమే-నెహ్రూ బొమ్మ తీసేసి, మన్మోహన్ బొమ్మ తగిలించటం  అంతే!!  

జరిగినంత కాలం నా అంత వాడు లేడు, అనుకోవటం మానవ సహజమైన బలహీనత. ఈ బలహీనతకు ఎవ్వరూ మినహాయింపు కాలేరు, ఒక్క భగవద్గీతను అర్ధం చేసుకున్న వాళ్ళు తప్ప అని నా అభిప్రాయం.

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

. . .నెహ్రూ గారు ఆర్ధికవేత్త కాదు. ఏదో ఆయనకి ఉన్న రొమాంటిక్ ఆలోచనలతో . . .

మన నెహ్రూ గారికి ఉన్నవన్నీ నిష్ప్రయోజనకరమైన సదరు రొమాంతిక్ ఆలోచనలే, నిరుపయోగ యశోవిలాసమే. ఆయన ఆలోచనలతో బాగానే భ్రష్టుపట్టిపోయింది దేశం. ఆయన గారి వారసులు కూడా యథాశక్తిగా దేశాన్ని తమతమధోరణులలో అంతే భ్రష్టుపట్టిస్తున్నారు లెండి.