ఈ కార్టూన్ ఐదు దశాబ్దాల క్రితం ఊమెన్ గారు 11 01 1963 వారపత్రికలో వేసినది. హిమాలయాలనే తమ దేశాంలోకి లాగేసుకోవలని చైనా దురాశ. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా చైన అదే దురాశారోగంతో తీసుకుంటూనే
![]() |
అవగాహనలోనూ, అభిప్రాయంలోనూ ఎంతటి తేడా! |
చైన తన దుష్టత్వాన్ని శతవిధాలా బయటపెట్టుకుంటూ, తమ దేశంలో

ఇది పూర్తిగా తెలిసి ఉండి కూడా "గాడిదగుడ్డేమీ కాదూ" అంటూ ఓట్రించే చైనా భక్తులూ మన మధ్యనే ఉన్నారు.చైనా యుధ్ధం జరుగుతున్న సమయంలో ఊమెన్ గారు "లోకం పోకడ" లో ఆంధ్ర సచిత్ర వార పత్రికలో 30 11 1962 వారపు సంచికలో వేసిన కార్టూన్.
1962 నాటికి నెహ్రూ గారు పంచషీల, ఇంకా అటువంటివే ఏవేవో సుభాషితాలు వల్లిస్తూ, అదే మన విదేశీ నీతని మురిసిపోతూ, నోబెల్ శాంతి బహుమతి కోసం ఎదురుచూస్తూ, భారత్ కు కావలిసిన సైనిక పాటవాన్ని ఇనుమడించటంలో, పూర్తి అశ్రధ్ధ వహించారు. ఆయనగారి రొమాంటిక్ ఆలోచనలను పూర్తిగా వాడుకుంటూ, చైనా భారత్ నుఆమ్రమించుకోవటానికి పన్నాగాలు పన్నటం మొదలెట్టింది. ఆపైన ఇక్కడున్న వాళ్ళ ఏజెంట్లు ఏమని సమాచారం అందించారో మరి, 1962లో భారత్ ను ఆక్రమించటానికి దాడి చేసింది. బలహీన స్థితిలో ఉన్నా, సరైన ఆయుధాలు, దుస్తులు లేకపోయినా కూడా, భారత సైనికులు వీరోచితంగా పోరాడి, పాణాలొడ్డి అప్పటికే చైనా ఆక్రమించుకున్న చోటినుండి ముందుకు రాకుండా నిలువరించగలిగారు. ఈ దెబ్బతో , నెహ్రూ గారికి తన సుభాషితాల విలువ తెలియవచ్చి, భారత్ సైనిక బలాన్ని పెంచవలసిన అగత్యాన్ని, ఆవశ్యకతను తెలియవచ్చి, రక్షణ శాఖ మీద ఎక్కువ శ్రధ్ధ పెట్టేట్టుగా చేసింది. ఊమెన్ గారు ఈ కార్టొన్లో 1962లో భారత్ సైనికుడు, అంటే చైనా దురాక్రమణకు ముందు ఆ తరువాత 1963 లో చైనా చేతిలో దెబ్బ తిన్న తరువాత భారత సైనికుడు ఉన్న పరిస్థితిని పోల్చి చూపుతున్నారు ఈ కార్టూన్లో.
కమ్యూనిస్ట్ చైనా భారత్ మీద దాడివల్ల భారత దేశంలో కమ్యూనిస్ట్ కోలుకోలేని దెబ్బ తిన్నది. వాళ్ళను నమ్మేవాళ్ళే కరువయ్యారు. 1962లో చైనా భారత్ మీద దురాక్రమణ చెయ్యకుండా ఉండి ఉంటె, ఏమో, కమ్యూనిస్ట్ పార్టీ ఇప్పటికంటే కొద్దిగా బలంగా ఉండే అవకాశాలు ఉండేవేమో. తమ ఇజాన్ని ఎగుమతి ఆత్రంలో, చైనా భారత్ మీద దాడి చేసి, భారత దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పటికీ పెరగకుండా చేసింది. కాని ఇప్పటికీ తమ ఇజం ఎగుమతి పధ్ధతి వదిలినట్టులేదు.

భారత్ మీద చైనా దురాక్రమణ తరువాత, ఈ ప్రాంతంలో ఉన్న ఇతర దేశాలకు చైనా అసలు రంగు తెలిసింది. అప్పటికి సిక్కిం మన దేశంలో భాగం కాదు, ప్రత్యేక దేశం. సిక్కిం, భూటాన్, నేపాల్ దేశాలు చైనా అసలు స్వరూపం చూసి ఝడుసుకుని, భారత్‌కు దగ్గిర అవుతాయని ఈ కార్టూన్లో ఊమెన్ గారి ఊహ. ఆయన అంచనా కొంతవరకూ నిజమయ్యింది. 1975 ప్రాంతాల్లో సిక్కిం, భారత్ లో భాగమై, సిక్కిం రాష్ట్రంగా అవతరించింది. భూటాన్ భారత్ తోనే ఎక్కువ స్నేహం కాని చైనాతో అంత స్నేహం లేదు. కాని నేపాల్ విషయంలో మటుకు మన విదేశీ నీతి ఘోరంగా దెబ్బ తిన్నది. 1980ల చివరి రోజుల్లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం, నేపాల్ ను అవమానకరమైన పధ్ధతిలో వారితో వ్యవహరించటం వల్ల, నేపాల్ చైనాకు దగ్గిర అవ్వటం మొదలు పెట్టింది. చివరకు, అక్కడ రాజకుటుంబం మొత్తం హత్య కావించబడి, ఎన్నికల్లో కమ్యూనిస్టులు గెలిచి రాజ్యాధికారంలోకి వచ్చారు. ప్రస్తుతానికి నేపాల్ లో పరిస్థితి భారత్ కు అనుకూలమా అంటే, గట్టిగా అవును అని చెప్పగలిగిన స్థితిలో లేదు. ఈ విషయంలో, భారత్ తప్పకుండా తమ విదేశీ నీతికి మరింత పదును పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
నిజానికి టిబెట్ అనే ప్రాంతం ప్రత్యేక బౌధ్ధ దేశం, ఆ దేశాధినేత దలైలామా బారత్ కు చైనాకు మధ్య ఉన్న "బఫర్ స్టేట్". అంటె రెండు శక్తివంతమైన, పెద్ద దేశాల మధ్య ఉన్న ఒక చిన్న దేశాన్ని, వాళ్ళీద్దరూ కొట్టుకోకుండా ఉన్న ప్రాంతాన్ని "బఫర్ స్టేట్" అని పిలుస్తారు. టిబెట్ ను ఆవిధంగా ఉంచి బ్రిటిష్ వారు చైనాతో భారత్ కు సరిహద్దు లేకుండా జాగ్రత్త పడ్డారు. కాని నెహ్రూ గారి అవకతవక విదేశీ విధానాల వల్ల, సరైన సమయంలో టిబెట్ ను భారత్ కాపాడలేదు. దానివల్ల, టిబెట్ ను చైనా ఆక్రమించి తమ దేశంలో కలిపేసుకుని, భారత్‌కు పిలవని పేరంటంగా, పొరుగు దేశంగా అవతరించి, మనకు ఎనలేని కష్టాలు తెచ్చిపెట్టింది. స్వతంత్రం సాధించగానే సరికాదు, దేశాన్ని పరిపాలించగల సత్తా ఉన్న నాయకులు, దేశాన్ని పరిపాలించాలి. అటువంటి నాయకులు లేకపోవటం, భారత దేశపు దురదృష్టం.

**********************************చైనా యుధ్ధం, ఆ యుధ్ధం జరిగిన తీరు, రాజకీయ తప్పిదాలు చక్కగా సమగ్రంగా వివరిస్తూ శ్రీ సుబ్రహ్మణ్య చైతన్య తన బ్లాగు "స్వర్ణ ముఖి" లో అద్భుతమైన వ్యాస పరంపర వ్రాశారు . ఆ వ్యాస పరంపరను ఈ కింది లింకు నొక్కి చదువుకొనవచ్చు మేరునగ తప్పిదం క్లిక్**********************************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి