ఊమెన్ గారి కార్టూన్లు ప్రప్రధమంగా ఆంధ్ర పత్రిక సచిత్ర వార పత్రిక వారు 20 07 1960 వార పత్రికలో ప్రచురించారు. అప్పటి ప్రకటన ఈ విధంగా ఉన్నది.
ఊమెన్ గారు వేసిన మొదటి కార్టూన్లు
పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం!?
పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యం!?
నెహ్రూ గారి పరుగు
ఇక ఈ కార్టూన్లో నెహ్రూ గారు తనకు మత్రమే తెలిసిన పంచవర్ష ప్రణాళికలను తయారుచేయిస్తూ, అప్పటి ఆర్ధిక పరిస్థితులతో ఆడుకున్నపటి విషయం. జాతీయాదాయం ఐదు శాతం అనుకుంటూ

నెహ్రూ గారు ఆర్ధికవేత్త కాదు. ఏదో ఆయనకి ఉన్న రొమాంటిక్ ఆలోచనలతో తనకు తెలిసినట్టుగా పరిపాలించే ప్రయత్నం చేశారు. కాని ఈ నాడు, సాక్షాత్తుగా రిజర్వు బాంకు గవర్నరుగా చేసి, ఆర్ధిక మంత్రిగా చేసి అపారమైన అనుభవమున్న వారు ఉన్నతమైన స్థానంలో ఉన్నా కూడా, ఇవ్వాళ్టికీ ద్రవ్యోల్బణానిదే గెలుపు. ఎక్కడుంది, పొరబాటు!
ఊమెన్ గారు ఈరోజున మన మధ్య ఉండి ఉంటే, ఈ కార్టూన్ వేసిన 43 సంవత్సరాల తరువాత కూడా, ఊమెన్ గారు చెయ్యవలసినది ఒక చిన్న పని మాత్రమే-నెహ్రూ బొమ్మ తీసేసి, మన్మోహన్ బొమ్మ తగిలించటం అంతే!!
జరిగినంత కాలం నా అంత వాడు లేడు, అనుకోవటం మానవ సహజమైన బలహీనత. ఈ బలహీనతకు ఎవ్వరూ మినహాయింపు కాలేరు, ఒక్క భగవద్గీతను అర్ధం చేసుకున్న వాళ్ళు తప్ప అని నా అభిప్రాయం.

1 కామెంట్:
. . .నెహ్రూ గారు ఆర్ధికవేత్త కాదు. ఏదో ఆయనకి ఉన్న రొమాంటిక్ ఆలోచనలతో . . .
మన నెహ్రూ గారికి ఉన్నవన్నీ నిష్ప్రయోజనకరమైన సదరు రొమాంతిక్ ఆలోచనలే, నిరుపయోగ యశోవిలాసమే. ఆయన ఆలోచనలతో బాగానే భ్రష్టుపట్టిపోయింది దేశం. ఆయన గారి వారసులు కూడా యథాశక్తిగా దేశాన్ని తమతమధోరణులలో అంతే భ్రష్టుపట్టిస్తున్నారు లెండి.
కామెంట్‌ను పోస్ట్ చేయండి