భారత దేశంలో ఉన్నన్ని భాషలు, మరే దేశంలోనూ ఉండి ఉండవు. మరి దేశం మొత్తానికి ఒకే భాష ఉండి తీరాలా, ఉండాలంటే ఆ భాష ఏ భాష? ఈ సమస్య భారత దేశాన్ని చాలా కాలంగా బాధించింది. స్వతంత్ర పోరాటం జరుగుతున్న రోజుల్లోనే, గాంధీ గారు, దేశం మొత్తం మీద హిందీ రుద్దటానికి శాయశక్తులా ప్రయత్నించి కొంతవరకూ కృతకృత్యులయ్యారనే చెప్పాలి.
విదేశీ దాడులను ఎక్కువగా ఎదుర్కుని, దక్షిణ భారత దేశంకంటే ఎక్కువగా దెబ్బలు తిని వాటివల్ల ఒక విధమైన దురుసైన నడవడికను సంతరించుకున్న ఉత్తర భారతీయులు, దేశాన్ని శాసించటం మొదలుపెట్టారు. సహజంగా తమదైన హిందీ భాషను అందరిమీదా రుద్దారు. దాని ఫలితమే, 1967-68 లో వచ్చి హిందీ డౌన్ డౌన్ ఉద్యమం. నాకు తెలిసి నేను చూసిన రెండో ఉద్యమం. మొదటిది విశాఖ ఉక్కు ఉద్యమం కాగా, రెండోది, ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం.
దుందుడుకుతనంగా భాషా బిల్లును ప్రవేశపెట్టి, అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, దక్షిణాత్యుల్లో ముఖ్యంగా అరవవాళ్ళను ఎక్కువగా దూరం చేసుకున్నది. తమిళులు ఏమైనా మనకంటే ఎక్కువ భాషాభిమానం
కలవాళ్ళు. అందుకని హిందీ ప్రచారాన్ని ఆ భాషను జాతీయ భాష అవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ ఉద్యమపు చాయలు కొన్ని తెలుగునాట కూడ కొంతకాలం కనపడ్డాయి. అప్పటి రోజుల్లో హిందీ సినిమాలు ఆంధ్ర ప్రాంతంలో విడుదల కానివ్వలేదు. హిందీ మాష్టార్లు అందరూ దాక్కుని భయపడుతూ బతికారు కొంతకాలం. చివరకు ఆ ఉద్యమం సమసిపోయింది. మాకు అప్పట్లో
హిందీ అక్షరాలు వ్రాయటం ఎప్పుడు నేర్పటం మొదలు పెట్టారో తెలుసా ఐదో క్లాసులో మాత్రమే. అది హిందీకి ఉన్న ప్రాధాన్యత. ఈ ఉద్యమం వల్ల జరిగిన మేలు మాకు సంతోషం కలిగించినది ఏమంటే, , హిందీలో 20 మార్కులు వస్తే చాలు పాస్ అవ్వటమే. చివరకు ప్రశ్నా పత్రం చూసి వ్రాసినా సరే, మార్కులు వేసి పాస్ చేశేవాళ్ళు.
విదేశీ దాడులను ఎక్కువగా ఎదుర్కుని, దక్షిణ భారత దేశంకంటే ఎక్కువగా దెబ్బలు తిని వాటివల్ల ఒక విధమైన దురుసైన నడవడికను సంతరించుకున్న ఉత్తర భారతీయులు, దేశాన్ని శాసించటం మొదలుపెట్టారు. సహజంగా తమదైన హిందీ భాషను అందరిమీదా రుద్దారు. దాని ఫలితమే, 1967-68 లో వచ్చి హిందీ డౌన్ డౌన్ ఉద్యమం. నాకు తెలిసి నేను చూసిన రెండో ఉద్యమం. మొదటిది విశాఖ ఉక్కు ఉద్యమం కాగా, రెండోది, ఈ హిందీ వ్యతిరేక ఉద్యమం.
దుందుడుకుతనంగా భాషా బిల్లును ప్రవేశపెట్టి, అప్పటి ఇందిరా గాంధీ ప్రభుత్వం, దక్షిణాత్యుల్లో ముఖ్యంగా అరవవాళ్ళను ఎక్కువగా దూరం చేసుకున్నది. తమిళులు ఏమైనా మనకంటే ఎక్కువ భాషాభిమానం
నిజలింగప్ప, బ్రహ్మానంద రెడ్డి, కామరాజ్ |
హిందీ అక్షరాలు వ్రాయటం ఎప్పుడు నేర్పటం మొదలు పెట్టారో తెలుసా ఐదో క్లాసులో మాత్రమే. అది హిందీకి ఉన్న ప్రాధాన్యత. ఈ ఉద్యమం వల్ల జరిగిన మేలు మాకు సంతోషం కలిగించినది ఏమంటే, , హిందీలో 20 మార్కులు వస్తే చాలు పాస్ అవ్వటమే. చివరకు ప్రశ్నా పత్రం చూసి వ్రాసినా సరే, మార్కులు వేసి పాస్ చేశేవాళ్ళు.
అప్పటి హిందీ వ్యతిరేక ఉద్యమం గురించి, ఊమెన్ గారు తనదైన శైలిలో చక్కటి కార్టూన్లు వేశారు.
3 కామెంట్లు:
ఈ హింది ఉద్యమము జరుగుతున్నప్పుడు నేను మద్రాస్ లోని మైలాపూర్ లో మా పిన్నిగారి ఇంటికి వచ్చేను. పోలీసులు ఇళ్ళల్లోకి వచ్చి అనుమానితులను తీసుకుపోయేవారు. నాకు అప్పుడు ఈ ఉద్యమాలు మీద అవగాహన లేదు. ధన్యవాదములు.
నేను కొంచెం పెద్దయ్యేటప్పటికి ఇంక ఈ ఉద్యమం అయిపోయినట్టుంది, అమ్మ, మేన మామలు మంచి హిందీ పాటలు పాడుతుండేవారు
. . . . తమిళులు ఏమైనా మనకంటే ఎక్కువ భాషాభిమానం కలవాళ్ళు. . . .
మన తెలుగువాళ్ళ కెక్కడి దండోయ్ మాతృభాషాభిమానం! మనకు లేని దాన్ని తక్కువ అని వేరే చెప్పాలా!
కామెంట్‌ను పోస్ట్ చేయండి