సిరిమావో బండారునాయకే ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా, ఈ కార్టూన్ ఊమెన్ గారు జూన్ 1970లో వేశారు. ఎందుకనో కానీ, శ్రీలంక మొదటినుంచి భారత దేశం తో కన్నా అక్కడేక్కడో ఉన్న దేశాలతో స్నేహం చెయ్యాలన్న తహతహ చూపిస్తూఉండేది.
1971లో పాకిస్తాన్ బంగ్లా దేశ్ మీద దమన నీతి చూపిస్తూ, అక్కడి స్వతంత్ర పోరాటాన్ని మిలిటరీని పంపి అణచివేస్తుంటే, భారత్ చూడలేక, పాకిస్తాన్ విమానాలను భారత్ మీదుగా బంగ్లా దేశ్ వెళ్ళటాన్ని నిషేధిస్తే, శ్రీలంక పాకిస్తానుకు తమ దేశంలో వారి మిలిటరీ విమానాలకు రీ ఫ్యూయల్ చేసుకోవటానికి అనుమతిచ్చింది.
కార్టూన్లో చూస్తే, అప్పటి శ్రీలంక ప్రభుత్వాన్ని అటు రష్యా ఇటు చైనా కూడా తమ పక్కకు లాక్కోవాలని ప్రయత్నిస్తున్నాయని ఊమెన్ గారి ఉద్దేశ్యం. నిజమే.
శ్రీలంక చివరకు చైనా వలలో పడి, ప్రస్తుతం ఇప్పుదున్న దీన స్థితికి వచ్చింది.
పక్కనే ఉన్న గంగి గోవులాంటి భారత దేశాన్ని వదిలి, అక్కడెక్కడో ఉన్న దుష్ట చైనా తో స్నేహాన్ని చేసినందుకు శ్రీలంకకు జరగవలిసినదే జరిగింది. ఇప్పటికైనా శ్రీలంక తమ మంచి కోరే భారత్ ను అర్ధం చేసుకుంటే మంచిది.