1960 దశకం 1980ల మొదటి రోజులలో ఆంధ్ర పత్రిక
సచిత్ర వారపత్రికలో ఎంతగానో పేరొందిన వ్యంగ్య చిత్రకారుడు శ్రీ ఊమెన్. వీరి
గురించి ఇప్పటి తరానికి తెలియాచెప్పాలన్న నా ప్రయత్నఫలితమే ఈ వ్యాసం.
ఊమెన్
(Oomen) ఒక వ్యంగ్య చిత్రకారుడు. వీరి రాజకీయ వ్యంగ్య చిత్రాలు ఎంతగానో
ప్రసిద్ధిపొంది, శంకర్ పిళ్ళై (శంకర్స్ వీక్లీ ఆంగ్ల వారపత్రిక-1975లో
ప్రచురణ ఆపివేశారు), అబు అబ్రహం (ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో ఒకప్పటి
కార్టూనిస్ట్) మరియు ఆర్ కే లక్ష్మణ్ (టైమ్స్ ఆఫ్ ఇండియాలో
కార్టూనిస్ట్) వంటి ప్రముఖ వ్యంగ చిత్రకారులు వేసిన వ్యంగ్య చిత్రాలతో
సమానంగా నిలబడ్డాయి.
తెలుగులో వ్యంగ్య చిత్రాలు
వేసేవారిలో ఎక్కువమంది, రాజకీయ వ్యంగ్య చిత్రాలకు దూరంగా ఉంటారు. బహు
కొద్దిమందిమాత్రమే రాజకీయ వ్యంగ చిత్రాలు చిత్రించి, వార్తాపత్రికలలోని
వార్తలను వినోదాత్మకంగా, సమాజానికి చురకలు అంటించి ప్రచురిస్తూ తమ జర్నలిజం
ప్రక్రియను కొనసాగిస్తూ ఉంటారు. తెలుగులో అటువంటి రాజకీయ వ్యంగ్య
చిత్రకారులకు ఆద్యుడు ఊమెన్.
నిజానికి, ఊమెన్‌కు తెలుగు రాదు.ఈయన ప్రతిరోజూ, ప్రతి వారం తాను వేసిన వ్యంగ్య చిత్రాలను ఆంగ్ల సంభాషణలను వ్రాసి, పత్రికకు పంపేవారట. అక్కడ పత్రిక సంపాదకులయిన శ్రీ శివలెంక రాధాకృష్ణ ఆ ఆంగ్ల సంభాషణలను తెలుగులోకి అనువదించి బొమ్మకి సరిపొయ్యేట్టుగా చేసి దిన/వార పత్రికలలో ప్రచురించేవారట. అందుకనే ఊమెన్ గారి కార్టూన్లల్లోని కాప్షన్లు పరిశీలిస్తే, రకరకాల చేతి వ్రాతలో కనపడతాయి.

ఊమెన్‌ను తెలుగు
వారికి పరిచయం చేసిన ఘనత ఆంధ్ర పత్రికకు దక్కింది. 1960లలో ఆంధ్ర పత్రిక
దినపత్రికలో "లోకం పోకడ" శీర్షికన వీరి రాజకీయ వ్యంగ్య చిత్రాలు ప్రతిరోజూ
ప్రచురించబడేవి. ఆ తరువాత ఆంధ్ర పత్రిక వారపత్రికలో కూడ "ఊమెన్ కార్టూన్లు"
అని ఒక పూర్తి పేజీ శీర్షికను మొదలు పెట్టి, అంతకు మునుపటి వారంలో జరిగిన
దేశీయ, అంతర్జాతీయ రాజకీయ సంఘటనల మీద వ్యంగ్య చిత్రాలు వేయటం మొదలు
పెట్టారు. ఈ శీర్షిక ఊమెన్ మరణించేవరకు నిరాఘాటంగా నిర్వహించబడింది..
వ్యక్తిగత జీవితం
ఊమెన్
కేరళీయుడు. ఈయన కేరళలోని తిరువాన్కూరుకు దగ్గరలో ఉన్న కటానం గ్రామంలో, ఒక
సంపన్న కుటుంబంలో 1916, ఫిబ్రవరి 20న జన్మించారు. తిరువనంతపురం సైన్సు
కాలేజీ నుండి పట్టభద్రులయినారు. ఆ తరువాత జర్నలిజం మీద ఉన్న ఇష్టంతో లండన్
స్కూల్ ఆఫ్ జర్నలిజం లో చేరి జర్నలిజం లో డిప్లొమా పొందారు. 1949లో తన
వివాహం అయిన తరువాత మద్రాసు నగరంలో స్థిరపడ్డారు. 78 సంవత్సరాలు జీవించి, చెన్నైలోని తన స్వగృహం లో 18 జులై 1984 న ఊమెన్ గారు కీర్తి శేషులయ్యారు.
వృత్తి జీవితం:
స్వతహాగా
మంచి చిత్రకారుడు ఊమెన్. దానికి తోడు, జర్నలిజంలో డిప్లొమా, వీటన్నిటికి
మించి రాజకీయాల మీద అమితమయిన ఆసక్తి, తమ ఊళ్ళోని గ్రంధాలయంలో చేసిన అధ్యయనం,
ఇవన్ని ఈయనను రాజకీయ వ్యంగ్య చిత్రకారునిగా మలిచాయి. తన ఇరవై రెండవ ఏట
కార్టూనిస్ట్ జీవితం మొదలు పెట్టారు. మొట్టమొదట, వీరి కార్టూన్లు పాట్నా
మరియు అలహాబాదు నగరాలనుండి వెలువడుతున్న 'లీడర్ గ్రూపు' కు చెందిన
ప్రచురణలలో వేయటం జరిగిందట. 'భారత్' మరియు 'సంగం' పత్రికలలో వేసిన
కార్టూన్లకు మంచి ప్రజాదరణ లభించింది. తమిళ భాషలో వెలువడుతున్న 'కల్కి'
పత్రికలో కూడ వీరి వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడ్డాయి. ఈ పత్రిలల్లో ప్రచురితమైన ఆయన కార్టూన్లు అందుబాటులో లేవు. ఎ పి ప్రెస్ అకాడమీ వారి కృషి ఫలితంగా, మనకు ఆంధ్ర పత్రిక దిన/వార పత్రికల్లో వేసిన కార్టూన్లు ఈ రోజున ఇంటర్నెట్లో అందుబాటులోకి వచ్చినాయి.
భారత దేశంలోనే కాకుండా అమెరికా మరియు కెనడా వంటి దేశాల్లో కూడ ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించబడ్డాయట. తెలుగులో ఆంధ్ర పత్రికలో మాత్రమే ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యేవి.
భారత దేశంలోనే కాకుండా అమెరికా మరియు కెనడా వంటి దేశాల్లో కూడ ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రదర్శించబడ్డాయట. తెలుగులో ఆంధ్ర పత్రికలో మాత్రమే ఈయన వ్యంగ్య చిత్రాలు ప్రచురితమయ్యేవి.
వ్యంగ్య చిత్రాల విశిష్టత:
తెలుగు
వారిలో ఎంతగానో ప్రజాదరణ పొందిన మొట్టమొదటి రాజకీయ వ్యంగ్య చిత్రకారుడీయన.
ఈయన తెలుగు వాడు కాదన్న విషయం కొంత తెలుసుకోవటానికి ప్రయత్నిస్తే కాని
తెలియని విషయమేకాని, ఈయన కార్టూన్లు చూస్తే తెలియదు. వ్యంగ్య చిత్రాలకు
తీసుకున్న రాజకీయ విషయం, బొమ్మల కనుముక్కు తీరు ఈయన కార్టూన్లకు మంచి పేరు
తెచ్చినాయి, ఎంతోమందికి చక్కటి రాజకీయ స్పూర్తిని అందచేసినాయి. రాజకీయాలను
సామాన్యులకు కూడా అర్ధం అయ్యేట్టుగా చెయ్యటంలో ఈయన వ్యంగ్య చిత్రాలు మంచి
సాఫల్యం పొందాయని చెప్పవచ్చు. తెలుగులోకి తర్జుమా చేసిన అప్పటి సంపాదకుకుడు
శ్రీ శివలెంక రాధాకృష్ణ తెలుగులో రాజకీయ వ్యంగ్య చిత్రాలకు తెర తీసి, మంచి
ఒరవడిని ఏర్పరిచి తీర్చిదిద్దారు.
అప్పట్లో ఊమెన్ కార్టూన్ల కొరకు ప్రతి రోజూ, ప్రతి వారం ఎదురు చూసేవారు. ఫలానా, ఫలాన రాజకీయ సంఘటన జరిగింది, దీనికి ఊమెన్ తన కార్టూన్లలో ఎలా స్పందిస్తారు, అని పాఠకులు ఆసక్తిగా ఎదురు చూసేవారు. వీరు తమ వ్యంగ్య చిత్రాలలో రాజకీయ నాయకుల బోలుతనాన్ని, నోటితో ఒకటి చెప్పి, ఆచరణలో మరొకటి చేసే తత్వాన్ని హాస్య పూర్వకంగా ఎండకట్టేవారు. ఈ పార్టీ అని, ఆ పార్టీ అని, ఏదో ఒక రాజకీయ గొడుగు కిందకు చేరి, మిగిలిన రాజకీయ పార్టీలను ఎద్దేవా చేసి ఇరుకున పెట్టే జర్నలిజం ప్రక్రియకు దూరంగా ఉండి, సాధ్యమయినంత వరకు నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు, గౌరవం సంపాదించుకున్నారు. కాని పాపం ఇందిరా గాంధీ విధించిన ఆత్యయిక పరస్థితి కాలంలో, ఈయన మొదట్లో కొన్ని కార్టూన్లను ఖాళీగా వదిలేసి ప్రచురించినా(వారపత్రికలో ఐదారు కార్టూన్లు ఒకేచోట వేశేవారు. సెన్సార్ జరిగింది అని పాఠకులకు తెలియచెయ్యటానికి ఖాళీగా వదిలేశారు, అదీ ఒక్క వారమే), తరువాత్తరువాత ఎంతయినా ఆంధ్ర పత్రిక కాంగ్రెస్ నాయకుని పత్రిక కదా, ఊమెన్ గారు కూడా కొన్ని భజన కార్టూన్లు వెయ్యక తప్పలేదు. కాని అప్పట్లో కొంతమంది జర్నలిస్టుల్లాగ, వంగమని ఆజ్ఞాపించినవారి ముందు, సాష్టాంగపడి, పొట్టమీద దేకలేదు.

పైన ఉన్న ఐదు కార్టూన్లల్లో మొదటి నాలుగు కూడా సెన్సార్ వాళ్ళను తప్పించుకుంటూ ఆత్యయిక స్థితిని మరీ పోగిడేయ్య కుండా ఊమెన్ గారు ఎలాగోలా చొటు నింపిన వైనం |
ఊమెన్ చురకలు:
ఆత్యయిక పరిస్థితి కాలంలో వీరి విమర్శా కొంత మొక్కవోయినా, వీరి కార్టూన్లలో సహజంగా రాజకీయ కార్టూన్లల్లో ఉండవలసిన చురుక్కు మనిపించే హాస్య ప్రధానమైన విమర్శా ఉంటూనే ఉన్నది. ఆయన కార్టూన్లల్లోని కొన్ని చురకలను ఇక్కడ ఉదహరించబడినాయి.
1960లలో
ప్రచురించబడ్డ ఒక వ్యంగ్య చిత్రంలో, చూడంగానే రాజకీయనాయకుడు అనిపించే
ఒకాయన, తన ఇంట్లో బల్లెక్కి నుంచుని ఉపన్యాసం దంచుతుంటే, అతని కొడుకు
తల్లిని అడుగుతుంటాడు, "అమ్మా! నాన్నకేమైనా పిచ్చెక్కిందా" అని. కొడుక్కి
సమాధానంగా తల్లి "లేదు బాబూ! ఆయన పార్లమెంటుకు ఎన్నికైతే ఇవ్వదలచిన
ఉపన్యాసం రిహార్సల్‌రా ఇది" అని. పార్లమెంటులో సభ్యుల నడవడిక తీరు మీద
వ్యంగ్యం.
1960లలోనే ప్రచురించబడ్డ మరొక వ్యంగ్య చిత్రంలో, రాజకీయ నాయకుడు ప్రజలను ఉద్దేసించి మాట్లాడుతూ "మహాజనులారా! ......ఈనాడు విద్యావసతులు వృద్ధి అయ్యాయి కనుకనే, నిరుద్యోగ సమస్య ఎదురైంది; ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది కాబట్టే, ధరవరలు పెరిగాయి; వాడకం ఎక్కువయింది కాబట్టే కాటకం ఏర్పడింది; అవినీతి అంటారా దినదినాభివృద్ధి చెందుతున్న అర్ధిక వ్యవస్థలో, అది ఉండక తప్పదు మరి....."అని అంటూ ఉంటే, నివ్వెరపోయి వింటూ ఉంటారు శ్రోతలు. రాజకీయ నాయకులు తమ వాదనా పటిమతో తప్పులను కప్పి పుచ్చుకోవటానికి చేసే అసమంజస వాదనలను ఎండకడుతుంది ఈ వ్యంగ్య చిత్రం. అమెరికా అద్యక్షుడు, జార్జ్ బుష్ 2008 సంవత్సరంలో వారి దేశంలో ఎర్పడ్డ ఆర్ధిక సంక్షోభ కారణాలు విశ్లేషిస్తూ, ఇటువంటి వితండవాదమే చేసి ప్రపంచ వ్యాప్తంగా నవ్వులపాలయ్యాడు.
అభిప్రాయాలు
ప్రముఖ కార్టూనిస్ట్ జయదేవ్
-రాజకీయాలను కార్టూన్లలో ఇమడ్చటం చాలా కష్టమైన పని. అదొక ప్రత్యేకమైన కళ.
ఎంతోమంది ప్రయత్నించినా, ప్రతిభ కొందరికే దక్కింది. శంకర్, లక్ష్మణ్,
అబూలకు అంతర్జాతీయ ఖ్యాతి కూడ లబించింది. వీరిని గురించి అందరికీ తెలుసు.
ఇంచుమించు అంతే ఖ్యాతిని అర్జించుకునీ, కొందరికి మాత్రమే మిగిలి పోయిన
రాజకీయ చిత్రకారుడు ఊమెన్. ఊమెన్ కార్టూన్లలో కొట్టొచ్చిన విశిష్టత
కనిపిస్తుంది.
================================================
ఊమెన్ గారి గురించి అనేక వివరాలు ఇంకా తెలియవలసి ఉన్నది. ఆయన గురించి తెలుసుకోవటానికి సకల ప్రయత్నాలూ చేశాను. కేరళ కార్టోనిస్టుల సంఘానికి కూడా వ్రాసి చూశాను. దురదృష్టం ఏమంటే వాళ్ళకి కూడా తమ తోటి కేరళ కార్టూనిస్టు గురించి తెలియదు.
వారి కుటుంబ సబ్యుల పేర్లు-తల్లి తండ్రులు, భార్య, పిల్లల పేర్లు,ఊమెన్ పూర్తి పేరు,
చిత్రాలు వేయటమేనా లేక ఇతర వృత్తి ఏమయినా చేసేవారా? చర్చిలో ఫాదర్‌గా ఉండేవారని ఎక్కడో కొన్ని దశాబ్దాల క్రితం చదివినట్టు గుర్తు.వారి
ఫొటొ, వీరి కార్టూన్ల పై ఇతరుల అభిప్రాయాలు, అప్పట్లో ఏమైనా వివాద
కారణమయినాయా (నాకు తెలిసినంతవరకు కాలేదు. నేను దాదాపు 1965 నుండి వారి మరణం
వరకు వారి కార్టూన్ల ను చదుతుండేవాడిని),వీరి కార్టూన్లు ఎమైనా సంకలనంగా
విడుదలయ్యాయా? (ఏ భాషలోనైనా సరే)
ఇటువంటి వివరాలు తెలిసిన వారెవరైనా నాకు తెలియచేయగలరు, ఈ వ్యాసాన్ని పరిపూర్ణం చేయటంలో తోడ్పడగలరు.
=================================================
అడిగిన వెంటనే తాను ఇంతకుముందు వ్రాసిన వ్యాసం కాపీ వెతికి నాకు పంపి అనేక వివరాలు అందచేసి(తన స్వహస్తాలతో చిత్రీకరించిన ఊమెన్ వ్యంగ్య చిత్రంతో సహా) వ్యాసం వ్రాయటానికి తోడ్పడిన ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీ జయదేవ్ గారికి నా కృతజ్ఞతలు. ఈ వ్యాసం లోగడ తెలుగు వికీపీడియాలో నేను వ్రాసినది ఇక్కడ పున:ప్రచురణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి