మరికొంత సమయం కావాలి, అవును మరి నినాదాలు ఇచ్చినంత సులభం కాదుకదా, ఆ నినాదాలను అమలుపరచటం! గరీబీ హటావో అన్న నినాదం వాడుకుని ఎన్నకల్లో గెలిచినంత మాత్రాన ఇల్లు అలికేశామని ఇక పండుగే అని ఆనందించిన రాజకీయ నాయకులకు ప్రజలు నిలదీస్తారని తెలియకపోవటమేమిటి? తెలుసు. కాని వాళ్ళేమి చెయ్యగలరులే అందునా గరీబీలు వాళ్ళకున్న సత్తా ఏమిటి వాళ్ళ చేత కావాలిసిన పని చేయించుకోవటం వెన్నతో పెట్టిన విద్య అన్న లోపలి ధీమాతో, బయటకి మాత్రం ఎంతో వినయంగా, "మరికొంత సమయం కావాలి" అని సన్నాయి నొక్కులు నొక్కుతూ ఇందిరా గాంధీ అడగటం, ఆ అడుగుతున్న భంగిమ, వెనకాల నుంచున్న చెంచా మోహంలో హావ భావాలు, పాపం ఆ గరీబీ ఎంతో ఆశగా వచ్చి నిలదీయటం, చివరకు ఇందిరా గాంధీ "ఓపిక పట్టండి" అనటంతో అతని మోహంలో నిరాశ కార్టూన్ చూసిన క్షణంలో అర్ధం అయ్యేట్టుగా వేసిన ఊమెన్ గారికి హాట్స్ ఆఫ్.
తన అనుచరులు నిలదీస్తున్న ప్రజలను చూసి వణుకుతున్నా, వారి నాయకురాలిగా సమయస్పూర్తితో "ఓపిక పట్టండి" అని ఠకీమని నిజాయితీ లేని జవాబు ఇచ్చి రాజకీయ మనస్తత్వాన్ని చక్కగా స్పురింపచేసింది అప్పటి ప్రధాని గాంధీ.
ప్రజలు మాత్రం ఏమి చేస్తారు! వేచి చూస్తూనే ఉన్నారు, వారి ఓపిక అనంతం కదా. ఆ అనవసర ఓపికే అన్ని అనర్ధాలకూ మూలం.
2 కామెంట్లు:
మీరు చాల మంచి విషయాలను తెలియజేయుచున్నరు.ధన్యవాదాలు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి