1, సెప్టెంబర్ 2018, శనివారం

ఆకాశవాణి ప్రామాణికత

 No automatic alt text available.

ఇప్పుడు అంటే ఆకాశవాణి ఒక్కటి మాత్రమె వినోద/సమాచార సాధనం కాదు. అనేకం ఉన్నాయి. ఇంటర్నెట్ వచ్చినాక, సమాచార విప్లవం జరిగి అరిచేతులో ఇమిడిపొయ్యే, మల్టీ పర్పస్ గాడ్జెట్ సెల్ ఫోన్ వచ్చేసింది. ప్రపంచంలో ఎక్కడ ఏమూల ఏమి జరిగినా క్షణాల్లో ప్రజలకు తెలిసిపోతున్నది.

కానీ దాదాపుగా 1990 మధ్య వరకూ కూడా, రేడియో అనేది మన దేశంలో ప్రధాన సమాచారా సాధనం. పొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి వచ్చే వార్తలు క్రమం తప్పకుండా ప్రజలు వినేవాళ్ళు. కానీ కాల క్రమేణా, ఆకాశవాణి వార్తలు, ఇతర కార్యక్రమాలూ, ముఖ్యంగా 1971 దగ్గరనుంచీ కూడా, ప్రభుత్వ కార్యక్రమాలను కీర్తిస్తూ (సమాచారం ఇవ్వటం కాదు) చేసిన కార్యక్రమాలే ఎక్కువ. పాలక పార్టీ కీ చెందిన ఒకే ఒక్క నాకయకురాలి మాటలు సుభాషితాలు లాగా ప్రచారం (ప్రసారం కాదు) చేసేవారు.

అలా మెల్లి-మెల్లిగా తన ప్రామాణికతను పోగొట్టుకుంటున్న ఆకాశవాణి మీద ఊమెన్ గారు వేసిన ఒక "విసురు" ఈ కార్టూన్లు.

జస్ట్ మూడు సంవత్సరాల తరువాత అప్పటి ప్రధాని తన పదవి కాపాడుకోవటానికి దేశంలో అవసరం లేని ఎమర్జెన్సీ విధించి ప్రజల ప్రాధమిక హక్కులను "సస్పెండ్" చేసినప్పుడు, ఆకాశవాణి విని ఎవ్వరూ వార్తలు తెలుసుకునేవారు కాదు. ఎంతయినా విచారకర విషయం ఏమంటే, భారత దేశంలో జరుగుతున్నా ముఖ్య సంఘటనల గురించి పరాయిం దేశాల రేడియో స్టేషన్ల మీద ఆధారపడవలసి వచ్చింది. బి బి సి, వాయిస్ ఆఫ్ అమెరికా వంటి విదేశీ వార్తా సంస్థల వార్తల నుండి మాత్రమె ఎమెర్జెన్సీ సమయంలో, దేశంలో జరిగిన/జరుగుతున్నా అవకతవకలను ప్రజలు తెలుసుకోగలిగారు.

2 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

అవును. ఎమర్జెన్సీ రోజుల్లో జనం వార్తలకోసం విదేశీయ సమాచారసంస్థలపై ఆధారపడవలసి వచ్చింది.
ఇప్పుడు మోదీ గారి హయాంలో ఆ ఎమర్జన్సీ విధించిన మాహానేత మనవడు నోరువిప్పి మాట్లాడటానికి విదేశీ పర్యటనలపై ఆధారపడవలసి వస్తోందిట పాపం. కాలవైపరీత్యమో ఆయన బుద్ధివైపరీత్యమో - ఏదో ఒకటి లెండి, ఏదైతేనేం.

Saahitya Abhimaani చెప్పారు...

రాహుల్ గాంధీ భారత్ లో ఉన్నప్పుడు జోకులు వెయ్యటమే కానీ మాట్లాడింది ఎక్కడ! బయట దేశాలకు వెళ్ళి, అవాకులూ చెవాకులూ పేలుస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ నాయనమ్మ పవర్లో ఉంటే, వెనక్కి వచ్చినప్పుడు ఎయిర్ పోర్టులోనే బేడీలు వేయించేది. అదృష్టం కాబట్టి, మోడీ ఉన్నాడు.