350 పైగా ప్రత్యెక ఆంధ్ర ఉద్యమకారులు పోలీసు/సి ఆర్ పి/సైన్యపు కాల్పుల్లో మరణించారు |
పైన ఉన్నవన్నీ కూడా 1972 సెప్టెంబరు నుంచి మార్చి 1973 వరకూ జరిగిన ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ఆంధ్ర పత్రిక దిన/వార పత్రికల్లో ఊమెన్ గారు వేసిన కొన్ని కార్టూన్లు.
.
చిత్రం ఏమంటే, ఎక్కడైతే ప్రత్యెక ఆంధ్ర అని మహోద్యమం జరిగిందో, ఎక్కడైతే 350 మంది, సి ఆర్ పి /సైన్యం కాల్పుల్లో (ఆత్మహత్యలు కాదు) మరణించారో, ఆదే ఆంధ్ర ప్రాంతంలో, ప్రస్తుతం (సెప్టెంబరు 2013) సమైక్య ఆంధ్ర ఉద్యమం ఉధ్రుతిన నడుస్తున్నట్టుగా టివి వార్తల్లో కొన్ని చానెళ్ళు చూస్తుంటే అనిపిస్తున్నది. అప్పటి ఉద్యమంలో మరణించిన వారి ఆత్మలు ఎంత క్షోబిస్తున్నాయో కదా! వారి ఆత్మలకు శాంతి కలిగే దారి కనపడటం లేదు.
అప్పట్లోనే ప్రత్యేక ఆంధ్ర ఏర్పడి ఉంటే, ఆంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అభివృద్ది లేకుండా మిగిలిపోయింది ఆంధ్ర ప్రాంతం. ఇప్పటికన్నా తెలివినపడి, ప్రత్యెక రాష్ట్రం తెచ్చుకుంటే (జరగబోయ్యే దానికి ఒప్పుకుంటే చాలు) మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత, బాధపడే అవసరం రాదు అని నా భావన.
అప్పట్లోనే ప్రత్యేక ఆంధ్ర ఏర్పడి ఉంటే, ఆంధ్ర ప్రాంతం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. అభివృద్ది లేకుండా మిగిలిపోయింది ఆంధ్ర ప్రాంతం. ఇప్పటికన్నా తెలివినపడి, ప్రత్యెక రాష్ట్రం తెచ్చుకుంటే (జరగబోయ్యే దానికి ఒప్పుకుంటే చాలు) మళ్ళీ నాలుగు దశాబ్దాల తరువాత, బాధపడే అవసరం రాదు అని నా భావన.
అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రాంతానికి ఘోరమైన అన్యాయం చేసింది ఐనా సరే ఆంధ్ర ప్రాంతపు వారికి (అపార్ధాలు చేసేసుకోకండి నేను విజయవాడలో పుట్టి పెరిగినవాడిని) ఏ మాత్రం రాజకీయ పరిజ్ఞానం లేదని 1977 ఎన్నికల్లో నిరూపించుకున్నారు. 1972-73 లో కాంగ్రెస్ ఇంతటి అన్యాయం చేసినా సరే, గట్టిగా నాలుగేళ్ల తరువాత ఎమర్జెన్సీ విధించి దేశం మొత్తాన్ని వంచించిన కాంగ్రెస్ కు 1977 ఎన్నికల్లో 42 లో 41 సీట్లు పళ్ళెంలో పేట్టి ఇచ్చారు. అది కూడా ఎప్పుడు, ఉత్తర భారత దేశం మొత్తం కాంగ్రెస్ ను ఓడించినప్పుడు! విజయవాడలో తెలుగు వాడైనప్పటికీ, ఆ ఊళ్ళో ఎవరికీ ముక్కూ-మొహం తెలియని ఉత్తర ప్రదేశ్ లో స్థిరపడిన గోడే మురహరిని కాంగ్రెస్ నిలబెడితే గొర్రెల్లాగా ఓట్లేసి పార్లమెంట్ కు ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడేదో సమైక్య ఆంధ్ర ఉద్యమంవల్ల, కాంగ్రెస్ పని అయిపోయింది అనుకుంటే పొరబాటే!
2 కామెంట్లు:
తెలుగు పాఠకులకు చిరపరచితులైన ఊమెన్ గారి కార్టూన్ లు మీ వ్యాఖ్యానం తో మళ్ళీ మీ టపాల లో ప్రచురిస్తున్నారు !
ఇది ఒక మంచి ప్రయత్నం. అభినందనలు !
సుధాకర్ గారూ!
ఈ బ్లాగులో మొట్టమొదటి వ్యాఖ్య మీదే. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
కామెంట్‌ను పోస్ట్ చేయండి